మెమరీని తరచు క్లీన్ చేయడానికి
మీ
కంప్యూటర్లో ఎంత మెమరీ ఉన్నా, ఎంత శక్తివంతమైన కంప్యుటర్ అయినా ఒకేసారి
పలు అప్లికేషన్ ప్రోగ్రాములను సుదీర్ఘ కాలం పాటు ఓపెన్ చేసి పెట్టడం వల్ల
సమయం గడిచేకొద్దీ పనితీరు నెమ్మదిస్తుంది. అలాంటప్పుడు కంప్యుటర్ ని
రీస్టార్ట్ చేస్తేనే తిరిగి ఊపండుకుంటుంది. ఇలా స్లో అయినప్పుడు రీస్టార్ట్
చేసే అవసరం లేకుండా ఒ చిట్కా పాటించవచ్చు. డెస్క్ టాప్ పై మౌస్ తో రైట్
క్లిక్ చేసి New>Shortcut అనే ఆప్షన్ ని ఎంచుకుని Type the location of
the item బాక్స్ లో క్రింది కమాండ్ ఉన్నదున్నట్లు టైప్ చేయండి.
%windir%system.32\rundll32.exe
advapi32.dll,ProcessIdleTasks ఇప్పుడు Next అని ప్రెస్ చేసి ఆ షార్ట్ కట్
కి Memory Cleaning లేదా మీకు నచ్చిన పేరు ఇవ్వండి. ఇకపై సిస్టం స్లో
అయిందని భావించినప్పుడల్లా ఈ షార్ట్ కట్ ని ఉపయోగించండి. మెమరీలో మొండిగా
కూర్చున్న టాస్క్ లు , త్రేడ్ లు క్లోజ్ చేయబడి మెమరీ ఫ్రీ చేయబడుతుంది.
Loading...