కొన్ని వెబ్ సైట్లు ఓపెన్ చేయకుండా బ్లాక్ చేయడం
మీ
ఇంట్లో చదువుకునే పిల్లలు ఉండి ఇంటర్నెట్ ద్వారా వారు Orkutలో
స్క్రాప్‍లు చేయడానికో , ఐడిల్ బ్రెయిన్‍లో వాల్ పేపర్లు వెదకడానికో టైమ్
వేస్ట్ చేస్తున్నారనుకోండి. ఆయా సైట్లు మీ కంఫ్యూటర్‍లో ఓపెన్ కాకుండా
నిరోధించవచ్చు. దీనికి ఎలాటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్ అవసరం లేదు. మీ
హార్డ్ డిస్క్ లో C:\Windows\System32\drivers\etc అనే ఫోల్డర్ లోకి వెళ్ళి
HOSTS అనే ఫైల్‍ని మౌస్‍తో రైట్ క్లిక్ చేసి Open అనే ఆప్షన్ ఎంచుకుని
Notepad తో ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్‍లో 127.0.0.1 local host అనే లైన్
క్రింద.. కొత్తగా 127.0.0.2 అనే అడ్రస్‍ని టైప్ చేసి దాని ఎదురుగా పై
చిత్రంలోని విధంగా ఏ సైట్ అయితే ఓపెన్ కాకుండా నిరోధించాలనుకున్నారో దాని
అడ్రస్‍ని టైప్ చేయండి. అలాగే ఒకదాని తర్వాత ఒకటి అలా వేర్వేరు సైట్ల
అడ్రస్‍లను టైప్ చేసి ఆ ఫైల్‍ని సేవ్ చేయండి. దీంతో ఇకపై ఆయా వెబ్ సైట్లు
ఓపెన్ అవకుండా బ్లాకవుతాయి.