మీకు
నచ్చిన వీడియో సిడిల్లోని వీడియోని కాపీ చేసుకోవాలనుకుంటున్నారా?
విసిడిలో CDI, EXT, SEGMENT, MPEGAV, VCD వంటి పేర్లతో పలు ఫోల్డర్లు
కనిపిస్తుంటాయి. వాటిలో MPEGAV అనే ఫోల్డర్‌లో మనం కాపీ చేసుకోవలసిన
వీడియో ఫైళ్ళు స్టోర్ చెయ్యబడి ఉంటాయి. ఈ వీడియో ఫైళ్ళు .DAT ఎక్స్‌టెన్షన్
నేమ్‌ని కలిగి ఉండీ, సాధారణంగా AVSEQ01, AVSEQ02 మాదిరి పేర్లని కలిగి
ఉంటాయి. వాటిని సెలెక్ట్ చేసుకుని Ctrl+C కమాండ్‌తో కాపీ చేసుకుని
హార్డ్‌డిస్క్‌లో వాటిని ఎక్కడైతే సేవ్ చేయ్యాలనుకుంటున్నామో అక్కడికి
వెళ్ళి Ctrl+V కీబోర్డ్ షార్ట్‌కట్‌తో పేస్ట్ చేస్తే సరిపోతుంది. లేదా
కాపీ, పేస్ట్‌లకు మెనూలోని ఆప్షన్లని ఉపయోగించుకోవచ్చు.