సీక్రెట్‌గా టేబుల్ వద్ద మాటలు వినాలా?
మన్మధుడు
సినిమాలో టేబుల్ క్రింద ఓ పరికరం అమర్చి అక్కడ ఏం
మాట్లాడుకుంటున్నారన్నది నాగార్జున వింటుంటాడు కదా. ఇప్పుడు చెప్పుకోబోయే
టెక్నిక్‌ని ఫాలో అయి దాదాపు అదే మాదిరి ఫలితాన్ని మీరూ పొందవచ్చు.ముందు మీ
ఫోన్‌లో కాల్ వచ్చిన కొన్ని సెకండ్లకు ఫోన్ ఆటోమేటిక్‌గా ఆన్సర్ చేయబడేలా
Auto Answer సదుపాయాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలాగే రింగ్ వాల్యూమ్‌ని
mute చేయండి. మీ ఇయర్ ఫోన్‌ని మీ ఫోన్‌కి గుచ్చితే దానంతట అదే headset
ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ ఫోన్‌ని ఏ టేబుల్ వద్ద మాటలు
వినాలనుకున్నారో ఆ టేబుల్ క్రింద కనిపించకుండా అమర్చండి. ఇప్పుడు బయటకు
వచ్చి వేరే ఫోన్ నుండి మీ ఫోన్‌కి కాల్ చేయండి. కొద్ది క్షణాలు రింగ్ అయిన
తర్వాత (రింగ్ సౌండ్ బయటకు రాదు) టేబుల్ క్రింద ఫోన్ ఆన్ అయి.. అక్కడ
మాట్లాడుకునే మాటలు మీకు వినిపిస్తుంటాయి. సరదాగా ప్రయత్నించి చూడండి.