మీ పేరు టాటూగా మార్చుకోవచ్చు…
ప్రేయసీప్రియులు
శరీరంపై పచ్చబొట్లు పొడిపించుకోవడం.. ఆకర్షణీయమైన టాటూలను అంటించుకోవడం
చాలాచోట్ల చూస్తూనే ఉన్నాం. ఇదే మాదిరిగా ఏ అందమైన అమ్మాయి తన వంటిపై మీ
పేరు టాటూగా ధరిస్తే చూడాలని ఉందా.. సహజంగా తీరే అవకాశం లేని మీ కోరిక www.crustydemons.co.uk/UK/tattoo_parlour/
అనే వెబ్‍సైట్ ద్వారా తీరడం ఖాయం. ఈ సైట్‍లోకి అడుగుపెట్టిన వెంటనే ఓ
అందమైన మోడల్ దేహంలోని నాలుగు భాగాలు ఓ వైపు, ఓ ఖాళీ బాక్స్ మరోవైపు
కన్పిస్తాయి. ఏదో ఒక భాగాన్ని ఎంచుకుని ఖాళీబాక్స్ లో మీ పేరు టైప్ చేసి
Apply బటన్ క్లిక్ చేస్తే కొద్ది క్షణాల్లో ఆ పిల్లదేహంపై మీ పేరుతో కూడిన
టాటూ ప్రత్యక్షమవుతుంది. ఆ వీడియో క్లిప్‍ని మీ స్నేహితులకు
పంపించుకోవచ్చు కూడా. అది చూస్తే వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఈర్ష్యపడతారు.