PDF Reader లేకుండానే PDF ఫైల్స్ open చెయ్యండి ఇలా..
ఇంతకు మునుపు పోస్టులో PDF files బ్రౌజర్ లో ఒపెన్ అవ్వకూడదు అంటే ఎలా అని చెప్పాను ఇక్కడ చూడండి..
అలా కాకుండా.. ఎప్పుడైనా
వేరే కంప్యూటర్ దగ్గరికి వెళ్లాం అనుకోండి. అక్కడ PDF reader software
లేదు. Urgent గా PDF file చూడాలి లేదా ప్రింట్ చెయ్యాలి అంటే ఎలా ?.
దానికి Chrome బ్రౌజర్ ఉంటే చాలు...
ఇలా చెయ్యండి..
1. PDF reader software లేకుంటే ఫైల్ ఇలా ఉంటుంది. దానిపై క్లిక్ చేసి open కొట్టండి..
2. అప్పుడు open with window వస్తుంది. దానిలో Browse అనేది ఎంచుకోండి.
3. Browse నొక్కగానే వచ్చిన విండోలో ఈ లొకేషన్ కి వెళ్లండి..
C:\Users\Administrator\ AppData\Local\Google\Chrome\ Application
(Administrator బదులు మీ కంప్యూటర్ username )
4. అక్కడ Chrome.exe అనే పైల్ ను ఎంచుకొని open నొక్కండి. తరువాత OK నొక్కండి.
( ఇకపై PDF లు అన్నీ ఎప్పుడూ CHROME లోనే
ఓపెన్ అవ్వాలి అంటే always use the selected program to open this kind of
file అని ఉంటుంది కదా దాన్నీ టిక్ చేసి OK నొక్కాలి )

5. ఇకపై PDF files అన్నీ Chrome బ్రౌజర్ లో ఒపెన్ అయిపోతాయి.. ఇలా...వాటిని ప్రింట్ చేసుకోవచ్చు..
6. ఒక వేళ మీకు PDF
reader software ఉన్నా మీరు Chrome తోనే ఓపెన్ చెయ్యాలి అనుకుంటే.. ఇలా
open with లోకి వెళ్ళి choose a default program అని సెలెక్టుచేస్తే 2nd
step నుండీ start అవుతుంది...