కంప్యూటర్ కు Earth ఎందుకు ఇస్తారో తెలుసా ?
కొంతమందిని నీ కంప్యూటర్ ఎందుకు
చెడిపోయింది అని అడిగితే.. ఎర్త్ లేకపోవడం వల్ల కాలిపోయింది అంటుంటారు..
అందుకే అసలు Earth అంటే ఏంటి అని రాయాలని నా చిన్న ప్రయత్నం...Earth అనేది Voltage ని కొలవడానికి వాడే Reference point అనమాట.. (అంటే 0 volts) దాన్ని కంప్యూటర్ లేదా చాలా Devices కు ఇవ్వడానికి కారణాలు..
1. Metal తో చేసిన devices కాబట్టి Insulation fail అయితే షాక్ కొట్టే ప్రమాదం ఉంది.. కాబట్టి Electrical insulation fail అయినా షాక్ కొట్టకుండా ఉండడం కోసం... 2. కంప్యూటర్ లాంటివి పని చేసేప్పుడు దానిలోని ఎలక్ట్రానిక్ parts లో కొంత వెస్టేజ్ కరెంట్స్ ఏర్పడుతాయి..కాబట్టి అలాంటి Unlimited current ను absorb చేసుకొని దానిలోని భాగాలు పాడవకుండా ఉంచడం కోసం Earth (Ground) కనెక్షన్ ఇస్తారు.... ఇంకా చాలా కారణాలు ఉన్నాయి.. మనకి ఇవి చాలు...
ఈ ఎర్త్ సరిగా లేదు అనుకోండి మదర్ బోర్డు, Network cards కాలిపోయే అవకాశాలు ఎక్కువ... అలా జరగకుండా ఉండాలి అంటే....
ముందుగా కొన్ని తెలుసుకుందాం...
3 Pin Plug లో మూడుపిన్నులు ఉంటాయి. అవి 1.Phase 2. Neutral 3. Earth (Ground)
సాకెట్ లోని Pin-3 (Earth ) నుండీ ఒక వైరు తీసుకెళ్లి ఇంటిబయట ఇలా ఒక Metal పైప్ ఏర్పాటు చేసి దానికి కనెక్షన్ ఇచ్చి ఉంటారు. దాన్నే Earth(Gorund) అని పిలుస్తారు.

కొన్ని సంవత్సరాల తరువాత ఏదైనా కారణాల వల్ల ఆ వైరు తెగిపోవడం లేదా, కనెక్షన్ ఊడి పోవడం జరిగింది అనుకోండి...మన డివైజ్ లు పాడువుతాయి. అంతేకాదు బాడుగ ఇంట్లో చేరిన వాళ్ళకు owners ఎర్త్ ఏర్పాటు చేసారో లేదో తెలీదు...అసలు Earth కనెక్షన్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్నదానికి చిన్న చిట్కా చెప్తాను....
నిజానికి మనం వాడుతున్న ప్లగ్ నే చెక్ చెయ్యాలి... కానీ అలా కాకుండా ఇంకో సులభమైన మార్గం..
రెండు సాకెట్స్ పక్కపక్కనే ఉన్నప్పుడు లోపల రెండింటికీ ఒకే earth కనెక్షన్ ఉంటుంది అన్నమాట.
అందుకని మన డివైజ్ (computer / grinder / Iron Box/ ఫ్రిజ్ ఏదైనా కావచ్చు.. కంప్యూటరే కాదు) పని చేస్తున్నప్పుడు ఒక టెస్టర్ తీసుకొని ఖాళీగా ఉన్న మరొక సాకెట్ లో ఇలా పెట్టండి.. Tester వెలిగింది అంటే Board నుండీ Earth Pipe వరకూ ఉన్న wire తెగినట్టు అర్దం.. లేదా అసలు Earth అన్నదే మీరు ఏర్పాటు చేయ్యలేదని అర్దం...
![]() |
Earth లేనప్పుడు... |
![]() |
Earth wire సరిగా ఉన్నప్పుడు.. |
చాలా మంది ఫ్రిజ్ డోర్ తీసినపుడు షాక్ వస్తుందనీ, ఐరన్ బాక్సు పట్టుకుంటే షాక్ వస్తుందనీ రకరకాలుగా చెప్తుంటారు.. అన్నింటికీ కారణం సరైనా Grounding లేకపోవడమే.. ఇలా చెక్ చేసుకొని. ఒకవేళ Ground సరిగా లేదు అని తెలిస్తే వెంటనే బాగుచేయించుకోండి.....
-----------------------------------------------------------------------------
(Board లో కన్నా Spike buster లో టెస్ట్ చెయ్యడం బెటర్...)
-------------------------------------------------------------------------------