Windows Vista క్రాక్‍తో డేంజర్ సుమా!

మైక్రోసాఫ్ట్ సంస్థ విడుదల చేసిన సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Windows Vista యొక్క బీటా వెర్షన్‍ని గతంలో పలువురు యూజర్లు నెట్ నుండి డౌన్‍లోడ్ చేసుకుని వాడుతున్నారు. ఈ వెర్షన్‍కి ఉన్న ప్రజాదరణని దృష్టిలో ఉంచుకుని కొందరు హ్యాకర్లు Vista Beta వెర్షన్‍ని జీవితకాలం ఉపయోగించుకోవచ్చంటూ ఇంటర్నెట్‍పై కొని వెబ్‍సైట్లలో ఏక్టివేషన్ క్రాక్‍ని పొందుపరిచారు. Windows Vista All Versions Activation 21.11.06 పేరిట నెట్‍పై దర్శనమిస్తున్న ఈ క్రాక్ ప్రోగ్రాంని మీ కంఫ్యూటర్‍లోకి డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేసుకున్నారో అంతే సంగతులు.. ఇది Crack కాదు. మన సిస్టమ్‍లోని కీలకమైన సమాచారాన్నిహ్యాకర్‍కి పంపిస్తుండే Trojan ప్రోగ్రామ్. ఇలాంటి వాటి మాయలో పడి మీ సిస్టమ్‍ని ఖరాబు చేసుకోకండి. Trojan.PSW Win32.LdPinch.aze అనే ట్రోజాన్ ప్రోగ్రామ్ ఇది. లేటెస్ట్ ఏంటి వైరస్ సాఫ్ట్ వేర్లన్నీ దీనిని గుర్తించగలుగుతున్నాయి. అయితే Norton Antivirus సాఫ్ట్ వేర్ ఈ ట్రోజాన్‍ని గుర్తించలేకపోవడం ఆశ్చర్యకరం. చాలామంది కంఫ్యూటర్లలో ఎక్కువగా ఈ ప్రోగ్రామే ఉండడంవల్ల సైలెంట్‍గా సిస్టమ్‍లోకి వచ్చేస్తోంది.