అన్ని ఫోన్లపై పని చేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్
Nokia,
Sony Erricsson, LG, Samsung వంటి అన్ని ప్రముఖ కంపెనీలకు చెందిన జావా
సపోర్ట్ కలిగిన దాదాపు అని మోడల్ ఫోన్లపై పనిచేసే ఇన్‍స్టెంట్ మెసెంజర్
ప్రోగ్రామ్ ఒకటి ఉంది. అదే Nimbuz. ఈ
ప్రోగ్రామ్‍ని ఫోన్‍లో ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‍లో GPRS
ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ లభిస్తుంటే Google Talk, Skype, AIM, Windows
Live Messenger, ICQ వంటి వివిధ ఇన్‍స్టెంట్ మెసేజింగ్ సేవలను నేరుగా మీ
ఫోన్‍లోనే యాక్సెస్ చేయవచ్చు. ఆయా సర్వీసులలో మీకు గల స్నేహితులకు
ఇంటర్నెట్ ద్వారా ఉచితంగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం Yahoo
Messenger ని కూడా ఈ సాఫ్ట్ వేర్ సపోర్ట్ చేస్తుంది.