DVD ROM కొనాలనుకుంటున్నారా?
ఆర్నెల్ల
క్రితం సిడిరామ్ డ్రైవ్‌లు లభించిన ధరకు ప్రస్తుతం DVD ROM డ్రైవ్‌లు
లభిస్తున్నాయి. సిడిరామ్ డ్రైవ్‌లు నాలుగైదు నెలలకు మించి సరిగ్గా
పనిచెయ్యకపోవడం, డీవిడి రామ్ డ్రైవ్‌లోనే సిడిలను సైతం యాక్సెస్
చెయ్యగలగడం వంటి పలు కారణాలవల్ల ఇటీవల సిడిరామ్ డ్రైవ్‌లకు బదులు డివిడి
రామ్‌లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న యూజర్లు ఎక్కువయ్యారు.
డివిడి రామ్ డ్రైవ్ dual-side డివిడి మీడియాని రీడ్ చెయ్యగలిగేది మాత్రమే
కొనుగోలు చేయ్యండి. ప్రస్తుతం గరిష్టంగా 16x స్పీడ్ కలిగిన డీవిడి రామ్‌లు
లభ్యమవుతున్నాయి. అంతకన్నా తక్కువ స్పీడ్ డ్రైవ్‌ని కొనకండి. మీరు
కొనుగోలు చేసే డివిడి రామ్ డ్రైవ్‌కి తప్పనిసరిగా 512KB బఫర్ మెమరీ ఉండేలా
జాగ్రత్త తీసుకోండి. సాధారణంగా డీవిడీరామ్ డ్రైవ్‌తో పాటు డివిడిలను ప్లే
చెయ్యడానికి ఉపకరించే సాఫ్ట్‌వేర్‌ని ఉచితంగా అందిస్తుంటారు. WinDVD వంటి
ప్రొఫెషనల్ డీవిడి ప్లేయింగ్ సాఫ్ట్‌వేర్ మీరు కొనే డీవిడిరామ్‌తో పాటు
లభిస్తే మంచిది. సిడిరామ్ డ్రైవ్‌లను కొనేకన్నా డివిడిరామ్‌ని కొనుగోలు
చెయ్యడం ఖచ్చితంగా బెటర్ డెసిషన్.