విండోస్ 8 ధరలు ఇవి..

అక్టోబర్ 26, 2012న రిటైల్ వెర్షన్ వస్తుంది.
మీరు విండోస్ 8ని వాడాలంటే 3 పద్ధతులు ఉన్నాయి.
1. ఇప్పటికే Windows XP, Vista, Windows 7లను కలిగి ఉన్న వారు Windows Upgrade Assistantని మీ కంప్యూటర్లో అక్టోబర్ 26న రన్ చేసి.. 40 డాలర్లని చెల్లించాలి. (ఈరోజుటి భారతీయ కరెన్సీ ప్రకారం అది రూ. 2,153) వెంటనే Setup ISO ఇమేజ్ డౌన్ లోడింగ్ మొదలవుతుంది. దాన్ని తర్వాత డివిడిలోకి గానీ, పెన్ డ్రైవ్‌లోకి గానీ కాపీ చేసుకోవచ్చు. లేదా అప్పటికప్పుడే ఇన్‌స్టలేషన్ ప్రారంభించవచ్చు.
అంటే ఇప్పటికే లైసెన్స్ కలిగి ఉన్న వారు రూ. 2,153కి అక్టోబర్ 26న ఒరిజినల్ విండోస్ 8కి మారిపోవచ్చు అన్నమాట.
గమనిక: విండోస్ 7 Ultimateని రూ. 11,000 పెట్టి కొన్నవారికి ఈ 2000ల ధరకు విండోస్ 8 లభించడం ఎంత చవకో అర్థమయి ఉంటుుంది. సో 2000 ఖర్చుపెట్టగలిగిన వారు పైరేటెడ్ వాటికన్నా జెన్యూన్ OSలకు వెళ్లడం మంచిది.
2. మీరు జూన్ 2, 2012 నుండి జనవరి 31, 2013 లోపల Windows 7ని కలిగిన లాప్‌టాప్ ని గానీ, బ్రాండెడ్ కంప్యూటర్‌ని గానీ కొని ఉంటే http://www.windowsupgradeoffer.com/en-US/Home అనే లింక్‌లో మీ బిల్ వివరాలతో రిజిస్టర్ చేసుకోండి వెంటనే.
అక్టోబర్ 26, 2012న మీకు మైక్రోసాఫ్ట్ నుండి ఇ-మెయిల్ వస్తుంది. వెంటనే కేవలం 15 డాలర్లు (అంటే ఈరోజుటి ధర ప్రకారం రూ. 807) చెల్లించి మీ Windows 7 కంప్యూటర్‌ని విండోస్ 8కి అప్‌డేట్ చేసుకోవచ్చు.
3. అస్సలు మీ జీవితంలో ఇప్పటివరకూ విండోస్ ఒరిజినల్ వెర్షన్‌ని వాడకుండా, పైరేటెడ్ వెర్షన్లే వాడుతున్న వారు 70 డాలర్లు (రూ. 3766) చెల్లించి విండోస్ 8 రిటైల్ వెర్షన్‌ని కొనుక్కోవచ్చు.
పై ఆఫర్లన్నీ జనవరి 31, 2013 వరకే పనిచేస్తాయి.
ఆ తర్వాత మీరు పై ధరలకు కొనలేరు. డిస్కౌంటెడ్ ప్రైసింగ్ మారిపోయి అసలు ధరలు చెల్లించాల్సి ఉంటుంది.
గమనిక: అందరు పిసి యూజర్లకి పనికొచ్చే ఈ సమాచారాన్ని మీ మిత్రులతోనూ షేర్ చేసుకోగలరు.