Pages

Pages

  ఆన్ లైన్ లో పెద్ద ఫైళ్ళను షేర్ చెయ్యటానికి మరియు వాటిని చూడటానికి!!

ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా పెద్ద పెద్ద ఫైళ్ళను వేగంగా మరియు సులభంగా అందరితో షేర్ చేసుకోవటానికి Jumpshare అనే ఉచిత ఆన్ లైన్ సర్వీస్ ఉపయోగపడుతుంది. ఫైళ్ళను డ్రాగ్-అండ్-డ్రాప్ చేసి లేదా  ’Select the files to Share' పై క్లిక్ చేసి కూడా షేర్ చెయ్యవలసిన ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. ఒకేసారి ఒకటికన్నా ఎక్కువ ఫైళ్ళను అప్ లోడ్ చెయ్యవచ్చు. 2GB వరకు ఎన్ని ఫైళ్ళనైనా అప్ లోడ్ చెయ్యవచ్చు.  ఫైల్ అప్ లోడ్ చేసిన తర్వాత వచ్చే లింక్ ని అవసరమైన వారితో షేర్ చేసుకోవచ్చు లేదా ఈ-మెయిల్ కూడా చెయ్యవచ్చు. షేర్ చేసిన ఫైల్ ని అవతలివారు అవసరమనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ఆన్ లైన్ లోనే ఫైల్ ని  ఓపెన్ చేసి చూడటానికి వ్యూయర్ కూడా   దీనిలోనే ఉంది. ఫైల్ వ్యూయర్ 200 పైగా ఫైల్ ఫార్మేట్లని సపోర్ట్ చేస్తుంది.  అప్ లోడ్ చేసిన ఫైల్ 2 వారాల వరకు ఉంటుంది.  
వెబ్ సైట్: Jumpshare

No comments:

Post a Comment