Pages

Pages

ఏదైనా సైట్ లో Mobile Number ఇవ్వడం ఇష్టం లేదా? ఇలా తప్పించుకోండి (Bypass All SMS Verifications)




    ఈ మధ్య చాలా సైట్లలో రిజిష్టర్ చేసుకొనేటప్పుడు మన మెబైల్ నెంబరు అడగడం.. ఆ నెంబరుకు  మెసేజ్ పంపి అందులో ఉన్న నెంబరును verify చెయ్యమని అడుగుతున్నాయి....  మామూలుగా మనం  మన అవసరం కొద్దీ వాడుకొనే G mail, YouTube, Facebook వంటి సైట్లలో మన నెంబరు ఇస్తే ఉపయోగం ఉంది . (ఈ ట్రిక్ వాటికైనా వాడుకోవచ్చు అనుకోండి).. కానీ వాటిలో ఇలా తప్పుగా  చేస్తే మనకే కొంత నష్టం.

   అలా కాకుండా  ఒక చిన్న గేమ్ ఆడుకోవడానికి, లేదా ఒక చిన్న ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికో కుడా  సై ట్ లో రిజిష్టర్ అవ్వాలనుకోండి. దానికి కూడా మెబైల్ నెంబరు ఇవ్వాల్సి వస్తే ఎలా ఉంటుంది.. మీరే చెప్పండి..ఇక అప్పటి  పిచ్చి పిచ్చి మెసేజ్ లు, DND లో Registration ఇవన్నీ అవసరమా ?.  అలా ఎక్కడైనా మెబైల్ నెంబరు ఇవ్వడం ఇష్టం లేకపోతే  ఇలా చెయ్యండి.

1. ముందుగా http://receive-sms-online.com/ అనే సైట్ కి వెళ్ళండి.. అక్కడ కొన్ని నెంబర్లు కనపడుతాయి.. వాటిలో ఏదో ఒకటి కాపీ చేసుకోండి.

2. ఆ నెంబరును మీరు రిజిష్టర్ చేసుకొంటున్న  సైట్లో మెబైల్ నెంబర్ బదులు  ఇవ్వండి.
3. ఇప్పుడు ఆ నెంబరుకు SMS పంపబడుతుంది కదా....
4. ఈ receive SMS  సైట్  లో మీరు కాపీ చేసుకొన్న ఆ  నెంబరు మీద క్లిక్ చేస్తే ఆ మెసేజ్ కనపడుతుంది.
5. ఆ verification నెంబరు కాపీ  చేసుకొని మీ సైట్లో వెరిఫై చేసేయ్యండి.. సమస్య తీరిపోయినట్లే కదా.....

నేను వేరే నెంబరు నుండి  ఒక టెస్ట్ మెసేజ్ పంపాను చూడండి..